ias: ఏపీలో నలుగురు ఐఏఎస్‌ల బదిలీ

  • విజయవాడ దుర్గగుడి ఈవోగా ఎం.పద్మ
  • కార్మిక ఉపాధి శిక్షణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్‌
  • పశు సంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది

ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న 2004 బ్యాచ్‌కు చెందిన ఎం.పద్మను విజయవాడ దుర్గగుడి ఈవోగా నియమించారు. కార్మిక ఉపాధి శిక్షణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ను నియమించగా, పశు సంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించారు. కాగా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
 

ias
Vijayawada
durgagudi
eo
  • Loading...

More Telugu News