BJP: జగన్ అవినీతిపరుడు, ఆయనతో కలవం: స్పష్టం చేసిన మంత్రి కామినేని

  • ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలుస్తామన్న జగన్
  • ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
  • గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసినందుకే ప్రజలు గెలిపించారు

త‌న పాద‌యాత్ర 900 కిలో మీట‌ర్లు పూర్తయిన సంద‌ర్భంగా నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓ జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అవినీతి పరుడని, ఆయన పార్టీతో తమ పార్టీ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసినందుకే ప్రజలు తమని గెలిపించారని వ్యాఖ్యానించారు.

BJP
Telugudesam
YSRCP
kamineni
  • Loading...

More Telugu News