mosquitoes: డెంగీ, మలేరియా, గున్యా దోమలకు బంతిపూలంటే భయం!
- దోమల కారణంగా వ్యాపించే డెంగీ, మలేరియా, గున్యా వ్యాధులు
- ఆడదోమల నియంత్రణకు సూచనలు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘం
- బంతి మొక్కలకు ఆడదోమలను నియంత్రించే సామర్థ్యం
డెంగీ, మలేరియా, గున్యా వంటి వ్యాధులు దోమల కారణంగా వ్యాప్తి చెందుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటికి చెక్ చెప్పాలని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అటవీ సంబంధింత అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం, బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ)కి పలు సూచనలు చేసింది. ముఖ్యంగా ఆడదోమలను అడ్డుకునే కొత్త పరిజ్ఞానంపై దృష్టి సారించాలని సూచించింది.
దీంతో డీటీబీ ఔషధ, వైద్య గుణాలున్న మొక్కలపై పరిశోధనలు ప్రారంభించింది. ఇందులో బంతి పూల మొక్కలకు వాటిని అడ్డుకునే సామర్థ్యం ఉందని గుర్తించారు. ఇంటి పరిసరాల్లో ఈ మొక్కలను పెంచితే ఈ రకం దోమలు ఆ పరిసరాలకు రావని వారు చెబుతున్నారు. దీనిపై మరింత లోతుగా అథ్యయనం చేపట్టినట్టు డీబీటీ విభాగం తెలిపింది.