Mega Fans: చెర్రీ, వరుణ్, సాయి ధరమ్ చెప్పారుగానీ, పవన్ కల్యాణ్ కు బన్నీ మాత్రం 'ఆల్ ది బెస్ట్' చెప్పలేదట!

  • ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్
  • మెగా హీరోల నుంచి పెద్ద ఎత్తున మద్దతు
  • ఇంకా అభినందనలు చెప్పని అల్లు అర్జున్
  • కారణమేంటని మెగాభిమానుల మధ్య చర్చ

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కు మెగా హీరోల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. ఇప్పటికే చిరంజీవి కుమారుడు రామ్‌ చరణ్‌ తో పాటు మరో ఇద్దరు మెగా హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లు పవన్‌ కల్యాణ్ కు 'ఆల్‌ ది బెస్ట్‌' చెబుతూ ట్విట్టర్ లో ప్రత్యేక ట్వీట్లు చేశారు. అయితే, ఇప్పుడు పవన్ అభిమానులు ఓ కొత్త విషయాన్ని బయటపెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పవన్ కు అభినందనలు చెప్పలేదట. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో మిగతా వారితో పోలిస్తే, యాక్టివ్‌ గా ఉండే బన్నీ, పవన్‌ కు విషెస్‌ చెప్పకపోవటం వెనుక కారణాలేంటన్న చర్చ అభిమానుల్లో జరుగుతోంది. మరోవైపు బన్నీ బ్రదర్ అల్లు శిరీష్ కూడా పవన్ రాజకీయ ప్రవేశంపై స్పందించలేదు. గతంలో జరిగిన సినిమా ఫంక్షన్స్ లో 'చెప్పను బ్రదర్‌' అంటూ వేదికపై మాట్లాడి, పవన్ అభిమానుల విమర్శలకు గురైన అల్లు అర్జున్, ఇప్పుడు స్పందించకపోవడం వెనుక కారణమేంటో?

Mega Fans
pawan
Allu Arjun
Ramcharan
Pawan Kalyan
  • Loading...

More Telugu News