purandeswari: బీజేపీతో పొత్తు, ప్రత్యేక హోదాలపై జగన్ వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందన

  • ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే మెరుగైనది
  • ఈ విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు
  • హోదా విషయాన్ని మళ్లీమళ్లీ లేవనెత్తడం సబబు కాదు

ప్రత్యేక హోదాను ఇస్తే, మరో ఆలోచన లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమని వైసీపీ అధినేత జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి స్పందించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ లాభాలను ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని చెప్పారు. స్పెషల్ స్టేటస్ కంటే స్పెషల్ ప్యాకేజీనే బాగుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్నారని ఆమె గుర్తు చేశారు. ముగిసిన హోదా అంశాన్ని మళ్లీమళ్లీ లేవనెత్తడం సమంజసం కాదని అన్నారు. 

purandeswari
Jagan
bjp
YSRCP
special status
  • Loading...

More Telugu News