SREYAS AYYAR: ధోనీ వస్తున్నాడు...వన్డే సిరీస్ ను కోల్పోము: శ్రేయస్ అయ్యర్

  • టెస్టు సిరీస్ లో టీమిండియా ఓటమి
  • వన్డే సిరీస్ కోసం త్వరలో ఆటగాళ్ల పయనం
  • వన్డే సిరీస్ విజయంపై శ్రేయస్ విశ్వాసం

సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇంకా ఒక టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో వన్డే సిరీస్‌ కోసం భారత్ నుంచి ఆటగాళ్లు బయల్దేరనున్నారు. ఈ క్రమంలో టీమిండియా వన్డే యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ధోనీతో కలిసి త్వరలో సఫారీ గడ్డపై అడుగుపెట్టబోతున్నామని తెలిపాడు. ధోనీ రాక జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుందని అన్నాడు. దీంతో సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌ ను గెలుచుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.

టెస్టు సిరీస్‌ ఓటమితో జట్టు ఏమాత్రం కుంగిపోదని అన్నాడు. తిరిగి పుంజుకోగల సామర్థ్యం ఉందని చెప్పాడు. జట్టు సామర్థ్యానికి తోడు ధోనీ రాక జట్టును మరింత బలోపేతం చేయనుందని అన్నాడు. గతంలో టీమిండియాను సఫారీ గడ్డపై నడిపించిన అనుభవం ఉపయోగపడుతుందని చెప్పాడు. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం వన్డే సిరీస్ ను చేజిక్కించుకోవడమేనని అయ్యర్‌ తెలిపాడు. సఫారీ పిచ్‌ లకు, మన పిచ్‌ లకు చాలా వ్యత్యాసం ఉన్న కారణంగా అక్కడికి వెళ్లాక గోల్‌ సెట్‌ చేసుకుంటానని చెప్పాడు. 

SREYAS AYYAR
team india
Cricket
  • Loading...

More Telugu News