Undavalli Arun Kumar: అదే జరిగితే బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం నిజమైనట్టే!: ఉండవల్లి అరుణ్ కుమార్

  • జాతీయ చానల్ తో జగన్ వ్యూహాత్మకంగా మాట్లాడారు
  • ఎన్నికల్లోపు ప్రత్యేక హోదా వస్తే, రహస్య ఒప్పందం ఆరోపణలు నిజమైనట్టే
  • జగన్, బీజేపీ కలిస్తే మంచో, చెడో కాలమే నిర్ణయిస్తుంది
  • మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

వైకాపా అధినేత వైఎస్ జగన్, నిన్న ఓ జాతీయ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు తనలో ఎన్నో అనుమానాలను రేకెత్తించాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతు గురించి జగన్ వ్యూహాత్మకంగా మాట్లాడినట్టు తనకు కనిపించిందని ఈ ఉదయం మీడియాతో ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను మోదీ ఇవ్వబోరన్న ఉద్దేశంలో జగన్ ఉన్నట్టుగా కనిపించలేదని అభిప్రాయపడ్డ ఆయన, 2019 ఎన్నికల్లోపు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించి, ఆపై ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలసి బీజేపీ వెళ్లినట్లయితే, బీజేపీతో జగన్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు నిజమైనట్టేనని భావించాల్సి వుంటుందని ఉండవల్లి పేర్కొన్నారు.

 ఇక జగన్, బీజేపీ కలిస్తే, ఏపీకి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో కలవలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడని తెలిపిన ఆయన, ఆ పరిస్థితి కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరి వల్లే వచ్చిందని వెల్లడించారు. విభజన హామీలు అమలు కావడం లేదని, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తరువాత చంద్రబాబు తెలుసుకున్నారని, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళతానంటున్న ఆయన, ముందు రాష్ట్రానికి అన్యాయం ఎవరు చేశారన్న విషయాన్ని తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు.

Undavalli Arun Kumar
BJP
YSRCP
Jagan
AP Special Status
  • Loading...

More Telugu News