Train Accident: నడుస్తున్న రైలు ఎక్కే ప్రయత్నంలో మరాఠీ సినీ నటుడు దుర్మరణం!

  • స్వగ్రామానికి బయలుదేరిన ప్రపుల్లా భలేరావు
  • రైలు ఎక్కేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలు
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి

అప్పటికే కదిలిన రైలును ఎలాగైనా ఎక్కాలన్న తొందరలో మరాఠీ సినీ, టీవీ నటుడు ప్రఫుల్లా భలేరావు (22) దుర్మరణం చెందారు. ఈ ఘటన ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. తన స్వగ్రామమైన గిర్ గాంకు వెళ్లాలన్న ప్రయత్నంలో మలాద్ స్టేషన్ కు వచ్చిన ప్రపుల్లా, నడుస్తున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన అతనిని దగ్గరలోనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. ఆపై వచ్చిన పోలీసులు, అతని సెల్ ఫోన్ ను పరిశీలించి, మృతుడు సినీ, టీవీ నటుడని గుర్తించారు. కాగా, ప్రఫుల్లా భలేరావు బాల నటుడిగా పరిచయమై గుర్తింపు పొందాడు. మరాఠీ టీవీల్లో ప్రసారమైన ‘కుంకు’, 'తు మాజా సంగతి', 'నకౌషి', 'జ్యోతిబా పూలే' తదితర సీరియల్స్ లలో నటించాడు.

Train Accident
Prapulla Bhalerao
Marathi Actor
  • Loading...

More Telugu News