Kim Jong Un: చనిపోయిందని భావించిన కిమ్ రహస్య ప్రియురాలు... దక్షిణ కొరియాలో ప్రత్యక్ష్యం!

  • అనూహ్యంగా సియోల్ లో దర్శనమిచ్చిన కిమ్ సీక్రెట్ లవర్
  • వింటర్ ఒలింపిక్స్ లో ఉత్తర కొరియా టీమ్
  • వారికి మద్దతుగా వచ్చిన హ్యోన్ సాంగ్ వోల్

ఆమె పేరు  హ్యోన్‌ సాంగ్‌ వోల్‌... ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు రహస్య ప్రియురాలు. ఓ అందమైన మిస్టీరియస్ మహిళ. ఉత్తర కొరియా అమ్మాయిలకు బ్రాండ్ అంబాసిడర్. చాలా కాలంగా బయట ఎక్కడా కనిపించ లేదు. కిమ్ తో వచ్చిన విభేదాల కారణంగా, ఆమెను ఉరేసి చంపించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇంత సంచలనమైన హ్యోన్ సాంగ్... అనూహ్యంగా దక్షిణ కొరియాలో కనిపించింది.

 సియోల్ లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ కు ఆమె రాగా, ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని పెట్టారు. ఉత్తర కొరియా ఆటగాళ్లకు మద్దతుగా ఉండటంతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించగా, ఆమెను చూసిన దక్షిణ కొరియా పౌరులు తమ నిరసనను తెలిపారు. సియోల్ రైల్వే స్టేషన్ వద్ద ఆమెను చూసిన నిరసనకారులు, కిమ్ చిత్రాలను, ఉత్తర కొరియా జెండాలను దగ్ధం చేశారు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టే వరకూ, తాను చేసేదేమీ లేక జరుగుతున్న నిరసనను సాంగ్ వోల్ చూస్తూ ఉండిపోయిందట.

Kim Jong Un
North Korea
South Korea
Lover
Huon Song Ol
  • Loading...

More Telugu News