Suchi Leaks: హీరో హీరోయిన్ల లింకులు మరిన్ని చెబుతా: మళ్లీ మొదలెట్టిన గాయని సుచిత్ర

  • ఎలా వెళ్లానో అలా వచ్చేశాను
  • మరింత మంది సీక్రెట్స్ చెబుతా
  • వీడియో మెసేజ్ లో గాయని సుచిత్ర

'సుచీ లీక్స్' పేరుతో గత సంవత్సరం పలువురు దక్షిణాది హీరో హీరోయిన్ల ఆంతరంగిక వ్యవహారాలను సోషల్ మీడియాలో బట్టబయలు చేసిన గాయని సుచిత్ర తిరిగొచ్చింది. తాను ఎలా వెళ్లానో, అలాగే వచ్చానని, పలువురు నటీనటుల బాగోతాలను విడుదల చేయనున్నానని చెబుతూ, ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో కోలీవుడ్ లో సంచలనం కలిగిస్తోంది.

గతంలో తన ట్విట్టర్ ఖాతాలో నటీనటుల ప్రైవేటు ఫొటోలను సుచిత్ర విడుదల చేయగా, తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, ఆ ట్వీట్లతో తనకు సంబంధం లేదని సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. తిరిగి ఇప్పుడు తాను మళ్లీ వచ్చానని ఆమె అంటుండటం గమనార్హం.

Suchi Leaks
Singer
Social Media
Kollywood
  • Loading...

More Telugu News