spice jet: స్పైస్ జెట్ రిపబ్లిక్ డే ఆఫర్...769 కే దేశీయ ప్రయాణం

  • ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ ఆఫర్ ప్రకటించిన స్పైస్ జెట్
  • దేశీయంగా ఒకవైపు ప్రయాణానికి ఆఫర్
  • 769 రూపాయల ప్రారంభ ధర
  • 2,469 రూపాయల ప్రారంభ ధరకే విదేశీయానం

రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థ ‘స్సైస్‌ జెట్‌’ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పరిమిత కాలముండే ప్రమోషనల్‌ ఆఫర్‌ ను ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’గా పేర్కొంది. ఈ ఆఫర్ లో ప్రయాణికులు దేశీయంగా ఒకవైపు మాత్రమే ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 769 రూపాయల ప్రారంభ ధరతో టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

అదే విధంగా విదేశీ వన్‌ వే ప్రయాణానికి 2,469 రూపాయల ప్రారంభ ధరతో టికెట్లను కొనుగోలు చేయవచ్చని స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 25 వరకు అందుబాటులో ఉంటుందని స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ ఆఫర్‌ లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు ఈ ఏడాది డిసెంబర్‌ 12లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని ప్రకటించింది.

spice jet
republi day sale offer
low flight charzes offer
  • Loading...

More Telugu News