Pawan Kalyan: 'జై జనసేన' అంటూ బాబాయ్ కి శుభాకాంక్షలు చెప్పిన రామ్ చరణ్!

  • తన రాజకీయ జీవితానికి కుటుంబ సభ్యుల మద్దతు లేదన్న పవన్ 
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించిన పవన్ కల్యాణ్
  •  ఫేస్ బుక్ పోస్ట్ పెట్టిన రామ్ చరణ్

తన రాజకీయాలకు, చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని నిన్న పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన రాజకీయ జీవితానికి కుటుంబ సభ్యుల మద్దతు లేదని కూడా పవన్ తెలిపారు. ఆయన ప్రకటించిన కాసేపటికే సోషల్ మీడియా ద్వారా ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ తన బాబాయ్ (పవన్ కల్యాణ్) కి శుభాకాంక్షలు చెబుతూ తన మద్దతు తెలిపారు.

ఫేస్‌ బుక్ వేదికగా ఆయన తన సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘నేను ఓ భారతీయుడిని, నా జన్మభూమిని రక్షించుకొనే బాధ్యత నాపై ఉంది.. అంటూ ఎనర్జిటిక్ కామెంట్‌ తో పవన్ చేపట్టిన ఈ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నా.. బాబాయ్ మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నా. జై జనసేన’’ అని పవన్ ఫోటో పెట్టి పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Pawan Kalyan
ram charan
facebook post
  • Loading...

More Telugu News