mla: పెద్దపల్లి ఎమ్మెల్యేపై రైతుల ఆగ్రహం.. పారిపోయిన ఎమ్మెల్యే!

  • సాగునీటి విషయమై పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని నిలదీసిన రైతులు
  • రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరుగు
  • పోలీసుల సాయంతో ఇల్లు చేరిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యేను రైతులు నిలదీయడంతో వారిని తప్పించుకుని పారిపోయిన ఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేటలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఆయన వస్తున్నారన్న సమాచారం అందుకున్న రైతులు మార్గమధ్యంలోనే ఆయన వాహనాన్ని అడ్డుకుని సాగు నీటి విషయమై నిలదీశారు.

అయితే కార్యక్రమ నిర్వాహకుల సాయంతో అక్కడి నుంచి వచ్చి, అందులో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తైన అనంతరం వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఆయనను రైతులు అడ్డుకుని నిలదీశారు. రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన ఆయన వాహనాన్ని వదిలి కారు దిగి రాజీవ్‌ రహదారిపైకి నడుచుకుంటూ వెళ్లారు. అయినప్పటికీ రైతులు మరింత ఆగ్రహంతో ముందుకు రావడంతో మనోహర్ రెడ్డి పరుగందుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆయనను తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.

mla
angry farmers
dasari manohar reddy
  • Loading...

More Telugu News