rajnath singh: పాక్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించిన రాజ్ నాథ్ సింగ్
- భారత్ ఏమాత్రం బలహీన దేశం కాదు
- ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ తలొగ్గబోదు
- ప్రత్యర్థులను మా భూభాగం నుంచే కాదు, వారి భూభాగంలోకి దూసుకెళ్లి మరీ మట్టుబెడతాం : యూపీలో రాజ్ నాథ్
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత్ స్థావరాలపై కాల్పులకు పాల్పడుతున్న పాకిస్థాన్ ను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ తలొగ్గబోదని స్పష్టం చేశారు. భారత్ ఏమాత్రం బలహీన దేశం కాదని, ప్రత్యర్థులను మన భూభాగం నుంచే కాదు, వారి భూభాగంలోకి దూసుకెళ్లి మరీ మట్టుబెడతామని ఘాటుగా హెచ్చరించారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, జమ్మూకాశ్మీర్ లో ఈరోజు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. బారాముల్లా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పోలీస్ స్టేషన్ ధ్వంసం కాగా, కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించారు. గ్రెనేడ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులపై పోలీసులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షుల కథనంగా ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.