Andhra Pradesh: ఏపీలో 26 నుంచి ‘దళిత తేజం – తెలుగుదేశం’

  • ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ వెల్లడి
  • పార్టీని దళితులకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం
  • ఏప్రిల్ 20న దళిత రాష్ట్ర మహాసభతో ముగిస్తాం

ఏపీలోని దళితవాడల్లో ఈ నెల 26 నుంచి ‘దళిత తేజం - తెలుగుదేశం’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్టీని దళితులకు మరింత చేరువ చేసేందుకు, దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ఏఏ పథకాలు అమలు చేస్తుందో తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. దళితవాడల్లో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి, ఎస్సీల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 20 తేదీన విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద నిర్వహించే దళిత రాష్ట్ర మహా సభతో ఈ కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు.

Andhra Pradesh
jawahar
  • Loading...

More Telugu News