Pawan Kalyan: ఎంతో అనుభ‌వం ఉన్న తెలంగాణ నాయ‌కులు జ‌న‌సేన‌లోకి వ‌స్తున్నారు: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • తెలంగాణ‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యంపై మేము విస్తృతంగా చర్చ జరుపుతాం
  • తెలంగాణ గురించి పట్టించుకోవాలని ఇక్కడి అభిమానులు అడుగుతున్నారు
  • ఓటుకు నోటు కేసు సమయంలో నేను స్పందించ‌లేదు
  • డబ్బు ఇవ్వడం త‌ప్పు అని నాకు తెలుసు.. సమస్యను మరింత రచ్చ చేయొద్దని స్పందించలేదు

తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల ఎంతో అనుభవం ఉన్న నాయకులు త్వ‌ర‌లోనే త‌మ పార్టీలో చేరుతున్నార‌ని జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఈ రోజు ఆయ‌న క‌రీంన‌గ‌ర్ లో మీడియాతో మాట్లాడుతూ... భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యంపై తాము విస్తృతంగా చర్చ జరుపుతామ‌ని అన్నారు. తెలంగాణలోనూ పర్యటించాలని, ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని తన అభిమానులు అడుగుతున్నారని ఆయన చెప్పారు.

కాగా, ఓటుకు నోటు వ‌చ్చిన‌ప్పుడు తాను స్పందించ‌లేద‌ని, ఆ ప‌ని త‌ప్పు అని త‌న‌కు తెలుస‌ని, కానీ బాధ్య‌త‌తో మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. అన్ని పార్టీలు విమ‌ర్శ‌లు చేశాయ‌ని, తాను కూడా ఒక మాట అని స‌మ‌స్య‌పై మ‌రింత ర‌చ్చ చేయ‌కుండా ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలని ఆలోచించాన‌ని పవన్ తెలిపారు. అందుకే ఆ విష‌యంపై స్పందించ‌లేదని చెప్పుకొచ్చారు. రాజ‌కీయ‌ప‌రంగా ఎవరికీ లబ్ధి చేకూర్చే ప‌నులు తాను చేయ‌నని అన్నారు. త‌న ప్ర‌తి అడుగు నిర్మాణాత్మ‌కంగానే ఉంటుందని తెలిపారు. ఏపీలో కులాల స‌మ‌స్య ఉందని అన్నారు. 

  • Loading...

More Telugu News