Pawan Kalyan: అసాధ్యమైన తెలంగాణ ఆంజనేయ స్వామి దయ వల్ల సుసాధ్యం అయింది: ప‌వ‌న్ క‌ల్యాణ్

  • కరీంనగర్‌లో పవన్ ప్రెస్‌మీట్‌
  • తెలంగాణ‌లో ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలుసుకుంటా
  • అయితే, తెలంగాణ విషయంలో ఆలోచించి అవగాహన తెచ్చుకున్న తరువాతే ముందడుగు వేస్తా

ప్రజా రాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేస్తోన్న తనకు కొండగట్టులో ప్రమాదం జరిగిందని, ఆంజనేయుడే తనను కాపాడాడని  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అసాధ్యమైన తెలంగాణ కూడా ఆంజనేయ స్వామి దయ వల్ల సుసాధ్యం అయిందని వ్యాఖ్యానించారు. అందుకే తాను కొండ‌గ‌ట్టు ఆంజేనేయుడి స‌న్నిధి నుంచే త‌న యాత్ర‌ను ప్రారంభిస్తున్నాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు.

 కరీంనగర్‌లో నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్ లో ప‌వ‌న్ మాట్లాడుతూ.... తెలంగాణ‌లో ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో తెలుసుకుంటానని చెప్పారు. తాను ఇరు రాష్ట్రాల్లో ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు. అయితే, తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో ఆలోచించి అవగాహన తెచ్చుకున్న తరువాత ముందడుగు వేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు. తెలంగాణ‌లోని స‌మ‌స్య‌ల‌పై త‌మ‌ బృందం అధ్య‌య‌నం చేస్తోందని చెప్పారు.

Pawan Kalyan
Jana Sena
Karimnagar District
  • Loading...

More Telugu News