karnataka: రోజుల వ్యవధిలోనే రెండు బంద్ లు... బెంగళూరుకు రైతుల ఉద్యమ సెగ

  • ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా
  • ఫిబ్రవరి 4న బెంగళూరులో బంద్
  • కర్ణాటక అనుకూల గ్రూపులు, రైతుల పిలుపు
  • మహదాయి నదీ వివాద పరిష్కారానికి డిమాండ్

కన్నడ అనుకూల సంఘాలు, రైతులు కర్ణాటక రాష్ట్రంలో రోజుల వ్యవధిలోనే రెండు రోజుల బంద్ నిర్వహణకు పిలుపునిచ్చారు. మహదాయి నదీ వివాద పరిష్కారం కోరుతూ జనవరి 25న రాష్ట్రవ్యాప్త బంద్ ఒకటి జరగనుంది. అలాగే, ఫిబ్రవరి 4న, ప్రధాని మోదీ బెంగళూరు నగరంలో పర్యటించే రోజున నగరంలో బంద్ నిర్వహణకు సంఘాలు పిలుపునిచ్చాయి.

 బీజేపీ రాష్ట్ర స్థాయి పరివర్తన ర్యాలీలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రానున్నారు. అదే రోజు బంద్ నిర్వహణ ద్వారా సమస్య తీవ్రతను ప్రధానికి తెలియజేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. మహదాయి నదీ వివాదం పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం, పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని కన్నడ గ్రూపులు ప్రజలకు పిలుపునిచ్చాయి. 

karnataka
bandh
  • Loading...

More Telugu News