indian muzahiddin: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తౌఖీర్ అరెస్ట్

  • ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో తౌఖీర్
  • బాంబుల తయారీలో సిద్ధహస్తుడు
  • గుజరాత్ వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు

ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బాంబుల తయారీలో తౌఖీర్ సిద్ధహస్తుడు. 2008లో గుజరాత్ లో జరిగిన వరుస పేలుళ్లతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినట్టు అతనిపై కేసులు ఉన్నాయి. అతనిపై రూ. 4 లక్షల రివార్డు ఉంది.

గుజరాత్ పేలుళ్ల తర్వాత ఖురేషీ కనిపించకుడా పోయాడు. అతని కోసం పలు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఖురేషీ తలదాచుకున్నట్టు సమాచారం అందడంతో ఢిల్లీ స్పెషల్ పోలీసులు నిన్న రాత్రి రంగంలోకి దిగారు. ఈ ఉదయం ఆపరేషన్ ముగిసింది. ఈ క్రమంలో కాల్పులు, ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకున్నట్టు సమాచారం.

indian muzahiddin
abdul subhan khureshi
  • Loading...

More Telugu News