Pawan Kalyan: మన సంప్రదాయం తెలియని భార్య చేసిన పనికి నవ్వుకున్న పవన్ కల్యాణ్... వీడియో చూడండి!

  • కారుకు దిష్టితీసి కొబ్బరికాయ కొట్టిన అన్నా లెజినోవా
  • కాయ పగలక పోవడంతో నవ్వుకున్న పవన్ కల్యాణ్
  • మరోసారి కొట్టాలని సూచన

తన భార్య అన్నా లెజినోవా చేసిన పని జనసేనానికి నవ్వు తెప్పించింది. హిందూ సంప్రదాయాల గురించి పెద్దగా తెలియని అన్నా, యాత్రకు బయలుదేరే ముందు పవన్ బయలుదేరే ఫోర్డ్ కారు 'ఏపీ 07 డీకే 2324'కు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయను కారు చుట్టూ ఎలా తిప్పాలి? ఎలా కొట్టాలన్న విషయమై పవన్ సైగలు చేస్తూ, చెబుతుండగా, అన్నా దాన్ని ఫాలో అయిపోయారు.

కొబ్బరికాయను ఆమె కారు చుట్టూ తిప్పుతుంటే పవన్, ముసిముసి నవ్వులతో నిలబడ్డారు. ఆపై కాయను నేలకేసి కొట్టగా, అది పగల్లేదు. దీంతో ఆమె తన నోటికి చెయ్యి అడ్డుపెట్టుకోగా, బిగ్గరగా నవ్విన పవన్, మరోసారి ట్రై చేయాలని సూచించారు. దీంతో ఈ దఫా కొబ్బరికాయను ఆమె మరింత గట్టిగా నేలకేసి కొట్టడంతో అది పగిలింది.

అంతే... అక్కడున్న జనసేన అభిమానులు, కార్యకర్తలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ఈ మొత్తం ఘటనా మీడియా కెమెరాలకు చిక్కి, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

Pawan Kalyan
Janasena
Anna Lezenova
  • Error fetching data: Network response was not ok

More Telugu News