BSNL: అదిరే ఆఫర్... ఒక్క రూపాయికే అపరిమిత డేటా!

  • బీఎస్ఎన్ఎల్ తో డేటావిండ్ ఒప్పందం
  • నెలకు రూ. 30తో అన్ లిమిటెడ్ డేటా
  • ఫిబ్రవరి నెలాఖరులోగా ప్లాన్ అందుబాటులోకి

ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)తో కుదుర్చుకోనున్న ఒప్పందంలో భాగంగా, కెనడాకు చెందిన డేటా విండ్ సంస్థ బంపర్ ఆఫర్ ను ప్రకటించేందుకు సిద్ధమైంది. రోజుకు కేవలం ఒక్క రూపాయితో అపరిమిత డేటాను అందించనున్నట్టు డేటావిండ్ వెల్లడించింది. నెలకు రూ. 30 ఖర్చుతో డేటావిండ్ స్మార్ట్ ఫోన్లలో నెలంతా అన్ లిమిటెడ్ డేటాను ఆస్వాదించవచ్చని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ తో డీల్ చివరి దశకు వచ్చిందని, ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపాయి.

BSNL
Datawind
Unlimited Deta
Rs.30
  • Loading...

More Telugu News