maheshbabu: నా ప్రియమైన భార్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు :మహేశ్ బాబు

  • ట్విట్టర్ లో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్స్
  • 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నమ్రత
  • మహేశ్ ప్రస్తుతం 'భరత్‌ అనే నేను' షూటింగ్ లో బిజీ

హీరో మహేశ్ బాబు.. భార్య నమ్రతా శిరోద్కర్‌కి ట్విట్టర్ లో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. 'నువ్వు ఎంత ప్రత్యేకమో చెప్పేందుకు మరో కారణం కూడా వుంది.. నా ప్రేయసి, నా స్నేహితురాలు, నా భార్య అయిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. నమ్రత ఈ రోజు తన 45వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటోంది. మహేశ్, నమ్రతలకు 2005, ఫిబ్రవరి 10న వివాహం అయింది. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్‌ అనే నేను' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

maheshbabu
namratha
cinema
birthday
  • Error fetching data: Network response was not ok

More Telugu News