Pawan Kalyan: 'సీఎం సీఎం...' అంటూ అభిమానుల నినాదాలు.. 'ఇక్కడేమీ చెప్పను' అంటూ బయలుదేరిన పవన్!

  • అభిమానుల కేరింతల మధ్య ప్రారంభమైన యాత్ర
  • కొండగట్టుకు బయలుదేరిన పవన్ కల్యాణ్
  • స్వామి దర్శనం తరువాత మాట్లాడతానన్న పవన్

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'చలోరే చల్' యాత్ర అభిమానుల కేరింతల మధ్య ప్రారంభమైంది. జనసేన కార్యాలయంలో భార్య అన్నా లెజినోవా వీడ్కోలు పలకగా, కారెక్కిన పవన్, రూఫ్ టాప్ పై నిలబడి, భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు.

అభిమానులంతా 'సీఎం... సీఎం' అని నినాదాలు చేశారు. ఆపై యాత్ర గురించి ఏమైనా మాట్లాడాలని మీడియా కోరినప్పటికీ, "ఇప్పుడేమీ చెప్పను. కొండగట్టుకు వెళ్లిన తరువాత మాట్లాడతా" అంటూ పవన్ కారు లోపలికి వెళ్లిపోయారు. కొండగట్టులో స్వామి దర్శనం తరువాత ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు జనసేన వర్గాలు వెల్లడించాయి. పవన్ కాన్వాయ్ లో దాదాపు 30కి పైగా వాహనాలు ఉన్నాయి. జనసేన నాయకులు, పవన్ అభిమానులు ఆయన వెంట యాత్రకు బయలుదేరి వెళ్లారు.

Pawan Kalyan
Janasena
Kondagattu
Fans
  • Loading...

More Telugu News