Donald Trump: తన వద్ద ఫ్లాట్ కొంటే న్యూయార్క్ టికెట్ ఫ్రీ అంటూ భారతీయులకు ట్రంప్ ఆఫర్!

  • ముంబైలో ట్రంప్ టవర్స్
  • భారత కస్టమర్ల కోసం ఆఫర్
  • జూనియర్ ట్రంప్ తో కలసి డిన్నర్ అవకాశం కూడా
  • అనైతిక వ్యాపారమన్న 'వాషింగ్టన్ పోస్ట్'

ముంబైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత కస్టమర్ల కోసం ఓ ఆకర్షణీయమైన ఆఫర్ ను ప్రకటించారు. ట్రంప్ టవర్స్ లో ఫ్లాట్ కొన్నవారికి న్యూయార్క్ కు రాను, పోనూ విమానం టికెట్ ఉచితంగా ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. న్యూయార్క్ కు వచ్చే కస్టమర్లతో తన కుమారుడు కలసి డిన్నర్ చేస్తాడని చెప్పారు. ట్రంప్ ఇచ్చిన ఆఫర్ పై 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తూ, ఇది అనైతిక వ్యాపారమని విమర్శించింది. ఆయన తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నాడని ఆక్షేపించింది. పత్రికలో వచ్చిన కథనంపై ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ స్పందిస్తూ, ఇది తమ కంపెనీ సంప్రదాయమని, కస్టమర్లతో యజమానులు కలసి డిన్నర్ చేయడం చాలా సంవత్సరాలుగా జరుగుతున్నదేనని పేర్కొంది.

Donald Trump
Trump Towers
Mumbai
Newyork
  • Loading...

More Telugu News