Amrapali: కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి కుదిరింది!

  • 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారితో వివాహం
  • ఫిబ్రవరి 18న పెళ్లి
  • ఈనెల 27 నుంచి సెలవుపై వెళ్లనున్న అమ్రపాలి

వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి వివాహం చేసుకోనున్నారు. ఎస్పీగా పనిచేస్తున్న 2011 బ్యాచ్‌ కు చెందిన ఐపీఎస్‌ అధికారిని తాను వివాహమాడనున్నట్టు ఆమె వెల్లడించారు. ఫిబ్రవరి 18న పెద్దల సమక్షంలో తమ పెళ్లి జరగనుందని ఆమె తెలిపారు. కాగా, ఈనెల 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నట్టు సమాచారం. తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తరువాత వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

 ఆపై పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్‌ పరిధిలో అభివృద్ధిని పరిగెత్తించారు. బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా వరంగల్ ను తీర్చిదిద్దడంలో తనదైన పాత్రను పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్న ఆమె, ప్రస్తుతం వరంగల్ రూరల్‌ జిల్లాకు కలెక్టర్‌ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Amrapali
Warangal Urban District
Warangal Rural District
Marriage
  • Loading...

More Telugu News