padmavat movie: తెలంగాణకు పాకిన 'పద్మావతి' సెగ!

  • 25న విడుదలకానున్న 'పద్మావత్'
  • హైదరాబాద్ లో రాజ్ పుత్ ల ఆందోళన
  • విడుదల చేయవద్దంటూ డిమాండ్

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' సినిమా 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమాను విడుదల చేయకూడదంటూ రాజ్ పుత్ లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ సెగ తెలంగాణ రాష్ట్రానికి కూడా పాకింది. తెలంగాణలో సినిమా విడుదలను ఆపేయాలని రాజ్ పుత్ క్రాంతిసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్ ఆగాపురలోని మహారాణాప్రతాప్ విగ్రహం వద్ద నిన్న ధర్నా చేపట్టారు. సినిమా విడుదలైతే, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మరోవైపు, నగరంలోని టివోలి సినిమా థియేటర్ వద్ద రాజస్థాన్ కు చెందిన దాదాపు 50 మంది రాజ్ పుత్ యువకులు ఆందోళన చేపట్టారు. సినిమాకు, దర్శకనిర్మాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

padmavat movie
bollywood
  • Loading...

More Telugu News