Narendra Modi: నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డ అన్నా హజారే

  • మోదీలో అహంకారం పెరిగిపోయింది
  • 30కి పైగా లేఖలు రాస్తే... స్పందనే లేదు
  • ప్రజల మద్దతు కోసం ర్యాలీ చేపట్టిన అన్నా

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీలో అహంకారం పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. గత మూడేళ్ల నుంచి తాను మోదీకి 30కి పైగా లేఖలు రాశానని... అయినా ఒక్క లేఖకు కూడా ఆయన బదులు ఇవ్వలేదని అన్నారు. తాను 'ప్రధానిని' అనే అహంకారం ఆయనలో నరనరాన జీర్ణించుకుపోయిందని విమర్శించారు. ఈ అహం వల్లే తన లేఖలకు స్పందించలేదని అన్నారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్ పడీలో ప్రజల మద్దతు కోసం ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీపై విరుచుకుపడ్డారు. 

Narendra Modi
anna hazare
  • Loading...

More Telugu News