jagan: 900 కిలోమీటర్లు దాటిన జగన్ పాదయాత్ర.. జనసంద్రంగా మారుతున్న రోడ్లు!

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్ర
  • చెర్లోపల్లి వద్ద 900 కి.మీ. యాత్ర పూర్తి 
  • రావి మొక్కను నాటిన జగన్

ప్రజల కష్టాలు, కడగండ్లను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను నాటారు జగన్.

కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా వేల సంఖ్యలో యువత, మహిళలు, రైతులు, చేతి వృత్తుల వారు జగన్ కు మద్దతు పలుకుతున్నారు. తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. వీరి సమస్యలన్నింటినీ ఎంతో ఓపికగా వింటూ, మనం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను తీరుస్తానంటూ భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. 

jagan
jagan padayatra
jagan yatra
  • Loading...

More Telugu News