KTR: స్విట్జర్లాండ్ చేరుకున్న కేటీఆర్.. రక్షణగా ఇద్దరు స్విస్ పోలీసులు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b674819110413548bbc4f737682c8ecdec8d3bfb.jpg)
- జ్యూరిచ్ చేరుకున్న కేటీఆర్
- స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణవాసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననున్న మంత్రి
విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. జ్యూరిచ్ నగరంలో అడుగుపెట్టిన ఆయనకు ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. రేపు ఆయన జ్యూరిచ్ నగరంలో పర్యటించనున్నారు. ఎల్లుండి నుంచి 26వ తేదీ వరకు దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పొల్గొంటారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. కేటీఆర్ రక్షణ కోసం స్థానిక ప్రభుత్వం ఇద్దరు స్విస్ పోలీసులను ఏర్పాటు చేసింది. దీనిపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వానికి, ఇండియన్ ఎంబసీకి ధన్యవాదాలు తెలిపారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-db27d0083855e4ee94f69d78f79e51e16eaf7322.jpg)