ram gopal varma: మియా మాల్కోవానే ఎంచుకోవడానికి కారణం ఇదే: రామ్ గోపాల్ వర్మ

  • మియా మాల్కోవా అందగత్తె
  • అందమైన అమ్మాయిని చూస్తే ఆహ్లాదం కలుగుతుంది
  • 26న విడుదల అవుతున్న 'జీఎస్టీ'

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరోవైపు, ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోర్న్ సినిమా తీయడం ద్వారా సమాజాన్ని వర్మ చెడగొడుతున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.

మరోవైపు, ఈ సినిమాలో మియా మాల్కోవానే ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న కూడా వర్మకు ఎదురవుతోంది. దీనికి ఆయన సమాధానం ఇచ్చారు. పోర్న్ స్టార్స్ అందర్లోకి మియా మాల్కోవానే అందమైనదని... అందుకే ఆమెను ఎంపిక చేశానని వర్మ చెప్పారు. ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మన మనసులో ఒక ఆహ్లాదం కలుగుతుందనే భావనతోనే ఆమెను తీసుకున్నానని తెలిపారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ram gopal varma
mia malkova
god S*x and truth
Tollywood
  • Loading...

More Telugu News