hotel hayyat: హైదరాబాద్ లోని ఫైవ్ స్టార్ హోటల్ కు భారీ జరిమానా!

  • అపరిశుభ్రంగా ఉన్న కిచెన్
  • సరైన డ్రేనేజీ కూడా లేదు
  • వెజ్, నాన్ వెజ్ కు ఒకే ఫ్రిజ్

నిబంధనల ప్రకారం పరిశుభ్రతను పాటించని హోటళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలో, హైదరాబాదులోని నానక్ రాంగూడలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ హయత్ పై దాడులు జరిపిన అధికారులు రూ. 26 వేల జరిమానా విధించారు. దీంతోపాటు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించకుండా హోటల్ ను నిర్వహిస్తున్నందుకు 13 లక్షల 65 వేల రూపాయలను వసూలు చేశారు.

తనిఖీల్లో అధికారులు పలు సంఘటనలను గుర్తించారు. ఫైర్ సేఫ్టీ లేకపోవడం, అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, వెజ్, నాన్ వెజ్ పదార్థాలకు వేర్వేరు ఫ్రిజ్ లు ఏర్పాటు చేయకపోవడం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటివాటిని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, హోటల్ పై కేసు కూడా నమోదు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News