manda krishna madiga: బెయిల్ కోసం పిటిషన్ వేసిన మంద కృష్ణ.. కొట్టేసిన కోర్టు!

  • అనుమతి లేకుండా దీక్ష చేసిన మంద కృష్ణ మాదిగ
  • బెయిల్ తిరస్కరణతో జిల్లా కోర్టులో అప్పీలు చేస్తానని చెప్పిన నేత
  • తమ నేతపై కేసులు వెనక్కు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ కోటి సంతకాల సేకరణ ప్రారంభం

అనుమతి లేకుండా దీక్ష చేశారన్న నేరంపై చంచల్ గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు మరోసారి తిరస్కరించింది. అయితే, ఇదే కేసులో ఇతర ఐదుగురు ఎమ్మార్పీఎస్ నేతలకు బెయిల్ లభించింది. తాను బెయిల్ కోసం జిల్లా కోర్టులో అప్పీలు చేస్తానని మంద కృష్ణ మాదిగ తెలిపారు.

కాగా, మరోవైపు మంద కృష్ణపై తెలంగాణ సర్కారు అక్రమ కేసులు పెట్టించిందని, వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కుమారపురం గ్రంథాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు.

manda krishna madiga
bail
pitition
  • Loading...

More Telugu News