harbhajan singh: కోహ్లీకి మద్దతు పలికిన హర్భజన్ సింగ్

  • ఇలాంటి సమయంలో అండగా నిలబడాలి
  • ఓటమి నుంచి ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవాలి
  • మళ్లీ సత్తా చాటుతారనే నమ్మకం ఉంది

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కోహ్లీని విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో కోహ్లీకి సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ నుంచి ఊహించని మద్దతు లభించింది.

ప్రతి ఒక్కరూ మెరుగ్గా ఆడాలనే ప్రయత్నిస్తారని... అయితే, మనం ఊహించిన మేరకు టీమిండియా జట్టు ఆడలేకపోయిందని భజ్జీ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలబడాలని సూచించారు. మన టీమ్ మళ్లీ సత్తా చాటుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. భారత ఆటగాళ్లకు ఈ ఓటమి ఒక గుణపాఠమని... ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ముందుకు సాగాలని తెలిపాడు.

harbhajan singh
virak kohli
team india
south africa tour
  • Loading...

More Telugu News