krishnam raju: వర్మ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' మూవీపై కృష్ణంరాజు స్పందన

  • వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి
  • సినిమా చూడాలని ఆయన ఎవరినీ కోరడం లేదు
  • చాలా మంది అలాంటి సినిమాలు చూస్తున్నారు

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమాను రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సంగతి తెలిసిందే. 26వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఈ చిత్రంపై సీనియర్ నటుడు కృష్ణంరాజు స్పందించారు. సినిమాను వర్మ ఏ ఉద్దేశంతో తెరకెక్కించాడనే విషయాన్ని చూడాలని ఆయన అన్నారు. తన చిత్రాన్ని చూడాలంటూ వర్మ ఎవర్నీ బలవంతం చేయడం లేదని చెప్పారు.

ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్కటీ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ రోజుల్లో ఒక విషయం పిల్లలకు తెలియకుండా కూర్చోబెట్టడం కుదిరే పని కాదని చెప్పారు. మనలో చాలా మంది అలాంటి సినిమాలు చూస్తున్నవారు ఉన్నారని తెలిపారు. వర్మను విమర్శించాల్సిన అవసరం లేదని... జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు దర్శకుడిగా ఆయనను చూడాలని చెప్పారు.

krishnam raju
ram gopal varma
bod S*x and truth
Tollywood
  • Loading...

More Telugu News