harish salve: చంపుతామంటూ సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వేకు బెదిరింపులు!

  • 'పద్మావత్' చిత్రం తరపున సుప్రీంలో వాదించిన సాల్వే
  • రాజ్ పుత్ కర్నిసేన నుంచి బెదిరింపులు
  • ఎఫ్ఐఆర్ నమోదు

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. 'పద్మావత్' సినిమాకు సంబంధించి ఆ చిత్ర నిర్మాతల తరపున సుప్రీంకోర్టులో సాల్వే వాదనలు వినిపించారు. దీంతో, రాజ్ పుత్ కర్నిసేనకు సంబంధించిన వ్యక్తులు ఈ బెదిరింపులకు దిగారు. 'పద్మావత్'కు అనుకూలంగా వాదించినందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అంటూ ఫోన్ ద్వారా బెదిరించారు. అంతేకాదు, దమ్ముంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని కూడా సవాల్ విసిరారు. ఈ విషయాన్ని మీడియాకు స్వయంగా సాల్వే తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News