Mahesh Babu: మహేశ్ కథ కూడా హాలీవుడ్ మూవీ ఆధారమేనా?

  • షూటింగ్ దశలో 'భరత్ అనే నేను'
  • మరో రచయిత నుంచి కథ తీసుకున్న కొరటాల 
  • మార్పులు చేర్పులపైనే ఆసక్తి

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి'కి అభిమానుల నుంచే ఆదరణ కరువైంది. ఓ ఫ్రెంచ్ సినిమాను కాపీ చేశారనే విషయం కూడా ఆ సినిమా ఫలితాన్ని ప్రభావితం చేసింది. తాజాగా అలాంటి రూమరే మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమా విషయంలో వినిపిస్తోంది.

 కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం మరో రచయిత నుంచి కొరటాల కథ తీసుకున్నారు. అయితే ఆ రచయిత 90లలో వచ్చిన ఓ హాలీవుడ్ మూవీని ఆధారంగా చేసుకుని కథను అల్లుకున్నాడట. మరి ఆ సినిమా స్క్రీన్ ప్లేను అలాగే ఉంచారా .. తనదైన శైలిలోకి కొరటాల మార్చారా? అనే విషయం తెలియాల్సి వుంది. స్క్రీన్ ప్లే పూర్తిగా మార్చి .. కథను కొత్తగా ఆవిష్కరించకపోతే కష్టమేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

Mahesh Babu
kiara adwani
  • Loading...

More Telugu News