GodavariUS: ప్రెస్ నోట్: ప్రామాణిక రుచుల‌తో ఫీనిక్స్‌, అరిజోనా‌లో భోజ‌న‌ప్రియుల కోసం సిద్ధ‌మైన గోదావ‌రి


ప్రెస్ నోట్: ద‌క్షిణ భార‌తీయ రుచుల‌ను అందించే రెస్టారెంట్‌ల జాబితాలో పేరెన్నిక‌గ‌న్న బ్రాండ్‌గా నిలిచిన గోదావ‌రి ఈ శనివారం జ‌న‌వ‌రి 20వ తేదీ, 2018న ఫీనిక్స్‌, అరిజోనాలో భోజ‌న‌ప్రియుల‌కు నాణ్య‌మైన రుచులు అందించేందుకు సిద్ధ‌మైంది.
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా గోదావ‌రి త‌న ఆహార రుచుల‌ను అందిస్తూ వినియోగ‌దారుల మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న విష‌యం ఇప్ప‌టికే మీకందరికీ సుప‌రిచితమే.
 
గోదావ‌రి ఫీనిక్స్‌, (Indian restaurants in Phoenix) ద‌క్షిణాది ప్రాంత ప‌ల్లెసీమ థీమ్‌తో అమ్మ చేతివంట‌ను స్పురణకు తెచ్చేలా అద్భుత‌మైన డిజైన్‌లో రూపుదిద్దుకున్న రెస్టారెంట్‌. గోదావ‌రి ఫీనిక్స్ సిద్ధమైన తీరు మీకు సొంత ఇంటిలో ఉన్న అనుభూతిని క‌లిగిస్తుంది. ప్ర‌త్యేకంగా రూపుదిద్దుకున్న థీమ్ మంత్రముగ్ధులను చేస్తుంది.
 
కార్పొరేట్ హ‌బ్‌లకు అత్యంత స‌మీపంలో గోదావ‌రి ఫీనిక్స్ ఉంది. అమెరిక‌న్ ఎక్స్‌ప్రెస్‌, ఏఏఏ స‌హా ఇత‌ర ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ‌ల‌కు అతి స‌మీపంలో ఉంది. ఈ రెస్టారెంట్‌కు అతి స‌మీపంలోనే ప్ర‌వాస‌ భార‌తీయులు నివాసం ఉంటున్నారు.
 
“టీం” గోదావ‌రి “కిరాక్‌” పేరుతో రూపొందించిన అద్భుత‌మైన బ్రాండ్ భోజ‌న‌ప్రియుల‌కు మ‌రిన్ని రుచుల‌ను అందిస్తోంది. సాల్ట్ లేక్ ఉటాలో త‌న మొద‌టి కేంద్రాన్ని ప్రారంభించింది.
 
“స్పైసీ స‌లా” పేరుతో గోదావ‌రి సౌత్ ఇండియ‌న్ ఫుడ్ ట్ర‌క్‌ హార్వ‌ర్డ్ మ‌రియు బోస్ట‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆత్మీయ రుచుల‌ను అందిస్తున్న విష‌యం మీ అందరికీ తెలిసిందే.
 
“గోదావ‌రి ఫీనిక్స్‌కు వ‌స్తుంద‌ని గ‌త కొద్దివారాలుగా మేం వింటున్నాం. అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుంద‌నేది స్ప‌ష్ట‌త‌ లేదు. భార‌తీయ రుచులు ప్ర‌త్యేకంగా ద‌క్షిణ భార‌తీయ వంట‌కాలు అందుబాటులో లేక‌పోవ‌డాన్ని మేం చాలా వెలితిగా భావిస్తున్నాం. ఇటీవ‌ల మేం క‌లుసుకున్న ప్ర‌తి సంద‌ర్భంలో గోదావ‌రి గురించి చ‌ర్చించుకుంటున్నాం. ఇక్క‌డ గోదావ‌రి ప్రారంభం అవ‌డం వ‌ల్ల వారి ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకొంటార‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నాం. గోదావ‌రి రెస్టారెంట్ ప్రారంభం అయిన త‌ర్వాత మొద‌టి వినియోగ‌దారులుగా మేమే వెళ‌తాం` అని ఓ కిరాణ‌ కేంద్రంలో షాపింగ్ చేస్తున్న సంద‌ర్భంగా ర‌వి మ‌రియు షీలా మెహ్తానీ అభిప్రాయ‌ప‌డ్డారు.
 
గోదావ‌రి ఫీనిక్స్ గ్రాండ్ గాలా బ‌ఫెట్‌తో ప్రారంభం అవుతోంది. నోరూరించే ఆహ్లాద‌క‌ర‌మైన రుచుల‌తో “ఇడ్లీ చాట్‌”, “గొడ్డు కారం రైస్‌”, “మామిడికాయ మాంసం కూర‌”, “స‌మ‌రం స‌మోసా పులుసు”, “కొర‌మీను తందూరి” వంటివాటితో పాటుగా మ‌రెన్నో నోరూరించే రుచులు సిద్ధంగా భోజ‌న‌ప్రియుల‌ను ఆక‌ట్టుకోనున్నాయి.
 
“గోదావ‌రి అనేది మాకు ఆహార సంబంధ‌మైన వ్యాపారం కంటే ఎక్కువ‌. అంకిత‌భావం, అభిరుచి, టీం వ‌ర్క్‌, ఇన్నోవేష‌న్ వంటి వాటి స‌మ్మిళితంగా మ‌మ్మల్ని న‌డిపిస్తున్న ఉత్సాహం కూడా! ఇప్ప‌టివ‌ర‌కు మా 22 కేంద్రాల్లో 10,000 మందికి పైగా అతిథుల‌కు నేటివ‌ర‌కు వ‌డ్డించాం. మా ప్ర‌తి కొత్త వినియోగ‌దారుడు మాకు ఆస్తి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక మంది ఔత్సాహికులు త‌మ కేంద్రాల్లో గోదావ‌రిని ఏర్పాటు చేసేందుకు విశేష ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు” కౌశిక్ కోగంటి వెల్ల‌డించారు.
 
గోదావ‌రి ఫీనిక్స్ (Best South Indian restaurant in Arizonaయ‌జ‌మానులు అయిన ముర‌ళి జంప‌ని, శ్యాం మెండు మాట్లాడుతూ “వినూత్న ఆలోచ‌న‌తో ఫీనిక్స్‌లో టీం గోదావ‌రిలో చేరుతున్నందుకు మేం ఆశ్చ‌ర్యం, ఆనందం వ్య‌క్తం చేస్తున్నాం. గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఫీనిక్స్ లో గోదావ‌రిని ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున ఔత్సాహికులు ఆసక్తిని చూపించిన‌ప్ప‌టికీ మ‌మ్మ‌ల్ని వారి బృందంలో చేర్చుకున్నందుకు టీం గోదావ‌రికి మేం కృత‌జ్ఞ‌త‌లు వ్య‌క్తం చేస్తున్నాం. ఇక్క‌డి అతిథుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు మేం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం” అని తెలిపారు.
 
“ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తిరోజూ త‌మ అతిథుల‌కు కొత్త వంట‌కాల‌ను అందించేందుకు అంకింత‌మ‌య్యాం. ఇందుకోసం అనేక వినూత్న ఆలోచ‌న‌లు, ఆచ‌ర‌ణ‌ల‌తో త్వ‌ర‌లో మ‌రికొన్ని రుచుల‌ను, అంశాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నాం” అని టీం గోదావ‌రి తెలిపింది.
 
రండి, మా ద‌క్షిణ భార‌తీయ రుచుల‌ను గోదావ‌రి ఫీనిక్స్‌లో ఈ శనివారం జ‌న‌వ‌రి 20వ తేదీ, 2018 నుంచి ఆస్వాదించండి…..
 
గోదావ‌రి ఫీనిక్స్‌
1909 డ‌బ్ల్యూ థండ‌ర్‌బ‌ర్డ్ రోడ్‌
ఫీనిక్స్‌, అరిజోనా 85023.
ఫోన్ః 602-795-5059
 
ద‌య‌చేసి సంప్ర‌దించండి
ముర‌ళి జంప‌ని
ఫోన్ః 330-285-0990
ఈమెయిల్‌: PHOENIX@GODAVARIUS.COM 
 
మ‌రోమారు మీ అందరికీ కృత‌జ్ఞ‌త‌లు. మా ఆత్మీయ‌ వంట‌కాల‌ను మీరు ఆస్వాదిస్తున్నార‌ని భావిస్తున్నాం.
 
 
Press note released by:Indian Clicks, LLC

  • Loading...

More Telugu News