cc cam: వేగంగా దూసుకొచ్చి బైకుని ఢీ కొన్న కారు.. ఎగిరిపడ్డ ఇద్దరు యువకులు.. సీసీ కెమెరాలో రికార్డు

  • విజయవాడలో ఘటన
  • ఇద్దరు యువకులకి ఆసుపత్రిలో చికిత్స
  • ఘటనపై ఆరా తీస్తోన్న పోలీసులు

వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బైకుని ఢీ కొన్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బైకుపై వెళుతోన్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు ఢీ కొట్టడంతో వారిద్దరు ఎగిరిపడ్డారు. వారిద్దరికీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘటనకు అతి వేగమే కారణమని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరం నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

  • Loading...

More Telugu News