Chandrababu: కోర్టుకు వెళతామని చంద్రబాబు అనడం సిగ్గు చేటు: అంబటి

  • ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారు
  • కేంద్ర ప్రభుత్వంలో ఉండి అదే ప్రభుత్వంపై కోర్టుకు వెళతారా?
  • హోదా కోసం బాబు ప్రయత్నం చేయలేదనేది అర్థమవుతోంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని... ఇది నిజంగా సిగ్గు చేటు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామి అని... వారి ప్రభుత్వంపై వారే కోర్టుకు వెళతారా? అని ప్రశ్నించారు.

విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా ప్రతిపాదన వస్తే ఆలోచిస్తామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారని... ఆయన చెప్పిన మాటలు వింటుంటే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ప్రయత్నం చేయలేదనే విషయం అర్థమవుతోందని అన్నారు. 

Chandrababu
ambati rambabu
special status
  • Loading...

More Telugu News