prashanth: చరణ్ .. బోయపాటి మూవీలో 'జీన్స్' హీరో ప్రశాంత్

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • విలన్ గా వివేక్ ఒబెరాయ్ 
  • కీలమైన పాత్రలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్  

చరణ్ - బోయపాటి కాంబినేషన్లోని సినిమా ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది. ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, స్నేహ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా సమాచారం.

గతంలో 'జీన్స్' .. 'దొంగ దొంగ' సినిమాల ద్వారా ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తరువాత ఆయన సినిమాలను తగ్గిస్తూ వచ్చారు. తెలుగులో ఆయన చేసే పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. చరణ్ .. బోయపాటి సినిమాలో భారీ తారాగణం వచ్చి చేరుతుండటం, అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతోంది.    

  • Loading...

More Telugu News