suriya: సూర్య ఎత్తు గురించి కామెంట్లు చేసిన యాంక‌ర్లు.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన విశాల్!

  • అమితాబ్‌తో న‌టించాలంటే సూర్య కుర్చీ ఉప‌యోగించాల‌ని వ్యాఖ్య‌
  • స‌న్ మ్యూజిక్ ఛాన‌ల్‌లో ఓ లైవ్ షోలో కామెంట్లు
  • ట్వీట్ చేసిన విశాల్‌, విఘ్నేశ్ శివ‌న్‌

ఇటీవ‌ల 'గ్యాంగ్' చిత్రంలో సూర్య 'నువ్వు ఎంత ఎత్తు ఉన్నావ్ అని కాదు... ఎంత ఎత్తు ఎదిగామ‌నేది ముఖ్యం' అని ఓ డైలాగ్ చెప్పారు. కానీ ఆ డైలాగ్ తెలిసి కూడా.. లైవ్ షోలో ఎత్తు గురించి సూర్యను ఓ ఇద్ద‌రు యాంక‌ర్లు కామెంట్ చేయ‌డం ఇప్పుడు కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌న్ మ్యూజిక్ ఛాన‌ల్‌లో ప్రసార‌మ‌య్యే 'ఫ్రాంకా సొల్ల‌టా' అనే కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు మ‌హిళా యాంక‌ర్లు సూర్య ఎత్తును అవ‌హేళ‌న చేశారు.

అమితాబ్‌తో న‌టించాలంటే సూర్య కుర్చీ వేసుకోవాల‌ని, లేదా అమితాబ్ కుర్చీలో కూర్చుని న‌టించాల‌ని వారు అన్నారు. అయితే ఈ మాట‌ల‌పై త‌మిళ ప‌రిశ్ర‌మ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ న‌టుడు విశాల్ ట్వీట్ చేశారు. 'ఈ మ‌ధ్య ప్ర‌తి ఒక్క‌రికి కామెంట్ చేయడానికి సినిమా వాళ్లే దొరికారు' అని ఆయ‌న పోస్ట్ చేశారు. విశాల్ ట్వీట్‌కి మ‌ద్ద‌తుగా గ్యాంగ్ చిత్ర ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ కూడా ట్వీటారు. న‌టుడిగా ఎన్నో విజ‌యాలు సాధించిన సూర్య లాంటి వారి మీద ఇలాంటి కామెంట్లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News