kathi mahesh: దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కత్తి మహేష్!

  • మాదాపూర్ పీఎస్ లో కత్తి మహేష్ ఫిర్యాదు
  • పవన్ అభిమానులే దాడి చేసి ఉంటారని భావిస్తున్నా
  • ప్రెస్ క్లబ్ లో కూడా దాడికి యత్నించారు

తనపై కోడిగుడ్లతో దాడి చేసిన వారిపై ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో తాను 99టీవీకి వెళుతున్నప్పుడు సైబర్ టవర్స్, శిల్పారామంల మధ్యలో తనపై దాడి చేశారని ఫిర్యాదులో మహేష్ పేర్కొన్నారు.

తనపై దాడి చేసింది పవన్ కల్యాణ్ అభిమానులే అని తాను భావిస్తున్నానని చెప్పారు. తనకు, పవన్ కల్యాణ్ అభిమానులకు మధ్య వివాదం కొనసాగుతోందని... గత 4 నెలల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఇటీవల ప్రెస్ క్లబ్ లో కూడా తనపై దాడికి యత్నించారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిని గుర్తించి, వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. 

kathi mahesh
kathi mahesh police complaint
  • Loading...

More Telugu News