golden globe: 'గోల్డెన్ గ్లోబ్' నల్ల దుస్తులను వేలం వేయనున్న హాలీవుడ్ నటీమణులు
- 'మీ టూ' ప్రచారానికి డబ్బులు సేకరించే ప్రయత్నం
- ఇవాళ్టి నుంచే ఈబే వెబ్సైట్లో వేలం
- పారితోషికంలో లింగ సమానత్వం కోసం ఈ ప్రచారం
హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్స్టెయిన్ ఉదంతం తర్వాత నటీమణులంతా లైంగిక వేధింపులకు, పారితోషికంలో లింగభేదానికి వ్యతిరేకంగా గళం విప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే 'మీ టూ', 'టైమ్స్ అప్' ప్రచారాలు పుట్టుకొచ్చాయి. వీటికి ఆదరణ కల్పించడం కోసం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ వేడుకకు అందరూ నల్ల రంగులు దుస్తులు ధరించి హాజరయ్యారు. దీంతో ఆ ప్రచారాలకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ఇప్పుడు వారు ధరించిన నల్ల రంగు వస్త్రాలను వేలం వేయాలనుకుంటున్నారు. తద్వారా వచ్చే మొత్తాన్ని 'పారితోషికంలో లింగ సమానత్వం' సాధించే ప్రచారానికి ఉపయోగించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఈబే వెబ్సైట్లో ఇవాళ వేలాన్ని ప్రారంభించారు.