Pawan Kalyan: హైదరాబాదులో పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధం!

  • ఉస్మానియాలో ఘటన
  • పవన్ అభిమానులు చేరుకోవడంతో ఉద్రిక్తత
  • పోలీసుల రాకతో అదుపులోకి వచ్చిన పరిస్థితి

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలో దహనం చేశారు. ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ పై పవన్ అభిమానులు కోడిగుడ్లతో చేసిన దాడిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే, ఇదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు కూడా అక్కడకు చేరుకోవడంతో... పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జై జనసేన, జై పవన్ కల్యాణ్ అంటూ వారు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే, సకాలంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో, అక్కడి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

  • Loading...

More Telugu News