venkatesh: వెంకటేశ్ తో కలిసి రంగంలోకి దిగుతోన్న తేజ

  • వెంకటేశ్ హీరోగా తేజ మూవీ
  • టైటిల్ గా 'ఆటా నాదే వేటా నాదే'
  • జనవరి 26వ తేదీ నుంచి షూటింగ్ మొదలు

వెంకటేశ్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో 'ఆటా నాదే వేటా నాదే' సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జనవరి 26వ తేదీన మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. సురేశ్ ప్రొడక్షన్స్ - ఏకే ఎంటర్టైమెంట్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి గానీ, ఎవరూ ఖరారు కాలేదు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించే అవకాశం వుంది. 

  • Loading...

More Telugu News