Kathi Mahesh: కత్తి మహేష్ కు వ్యతిరేకంగా కదిలిన ఉస్మానియా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్... పోటాపోటీ ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత!

  • నిన్న కత్తి మహేష్ పై కోడిగుడ్లతో దాడి
  • నేడు దిష్టిబొమ్మను దగ్ధం చేయాలన్న ఉస్మానియా విద్యార్థులు
  • పోటీగా నిరసనలు చేపట్టిన వర్శిటీలోని మెగా అభిమానులు
  • ఎలాంటి నిరసనలు చేపట్టినా చర్యలుంటాయన్న పోలీసులు

సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై నిన్న కోడిగుడ్లతో దాడి జరిగిన నేపథ్యంలో, ఈ దాడి పవన్ కల్యాణ్ అభిమానులే చేశారని ఆరోపిస్తూ, ఉస్మానియాలోని దళితవర్గం విద్యార్థి నేతలు నేడు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలపాలని చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది.

యూనివర్శిటీలోని పవన్ కల్యాణ్ అభిమానులు పోటీ ఆందోళన తలపెడుతూ, తమ హీరోను విమర్శిస్తున్న కత్తి మహేష్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అటు దళిత సంఘాలు, ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు ఉస్మానియాలో పోటాపోటీ ఆందోళనలకు దిగడంతో వర్శిటీ మీదుగా వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. వర్శిటీలో ఎటువంటి ఆందోళనలకూ అనుమతి లేదని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

Kathi Mahesh
Pawan Kalyan
eggs
Osmania University
Fans
  • Loading...

More Telugu News