Agnatavaasi: 'అజ్ఞాతవాసి' ఇంత మౌనంగా ఉండటం ఏంటి? ఇక లీగల్ నోటీసే: లార్గో వించ్ దర్శకుడు జరోమ్ సాలీ

  • తన చిత్రానికి 'అజ్ఞాతవాసి' కాపీ అని ఆరోపించిన జరోమ్ సాలీ
  • సినిమా వచ్చి వారం దాటినా స్పందించలేదని ఆగ్రహం
  • చట్టపరమైన చర్యలకు దిగనున్నట్టు ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడి

పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' కథ తాను తీసిన లార్గో వించ్ చిత్రానికి కాపీయేనని గతంలో ఆరోపించిన ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాలీ, మరోసారి తెరపైకి వచ్చారు. సినిమా విడుదలై వారం రోజులు దాటినా, తన ఆరోపణలపై స్పందన రాలేదని ఆరోపించిన ఆయన, ఇక చర్యలు తీసుకోవడం ఒక్కటే తన ముందున్న మార్గమని, లీగల్ నోటీసులు పంపనున్నానని స్పష్టం చేశారు. "కాపీ కొట్టకుండా క్రియేటివిటీతో సినిమాలు తీయగల సత్తా భారతీయ చిత్ర పరిశ్రమకు ఉందనే భావిస్తున్నాను. అయితే, గత వారం రోజులుగా 'అజ్ఞాతవాసి' టీమ్ నుంచి మౌనమే సమాధానమైంది. ఇక చట్టపరమైన చర్యలకు దిగనున్నా" అని జెరోమ్ సాలీ తన ట్విట్టర్ ఖాతాలో హెచ్చరించారు.

Agnatavaasi
Pawan Kalyan
Twitter
Jérôme Salle
  • Error fetching data: Network response was not ok

More Telugu News