Jayaprada: ఇది రెండున్నర గంటల సినిమా కాదు!: రజనీకాంత్, కమలహాసన్ ల రాజకీయ ప్రవేశంపై జయప్రద కామెంట్!

  • ఇక్కడ రాణించడం చాలా కష్టం
  • ముళ్లు, రాళ్లతో కూడిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు
  • ఎవరు రాణిస్తారో చెప్పలేనన్న జయప్రద

రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా ఏమీ కాదని, రాణించడం చాలా కష్టమని సీనియర్ నటి జయప్రద వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాజకీయ పార్టీని ఎనౌన్స్ చేసిన కమలహాసన్, త్వరలో రాజకీయాల్లోకి రానున్న రజనీకాంత్ లను ఉద్దేశించి మాట్లాడిన ఆమె, వీరిద్దరూ నడవాలని భావిస్తున్న దారి పూలదారేమీ కాదని అన్నారు. ఎన్నో ముళ్లు, రాళ్లతో నిండిన క్లిష్టమైన మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారని, జాగ్రత్తగా చూసి అడుగు వేయాలని సూచించారు.

సినిమాలకు, రాజకీయాలకూ ఏ మాత్రం సంబంధం ఉండదని అన్నారు. వీరిద్దరి రాజకీయ ప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని, జయలలిత మరణంతో తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను వీరు తొలగించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వీరిలో ఎవరు రాణిస్తారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జయప్రద వ్యాఖ్యానించారు. తాను తిరిగి రాజకీయాల్లోకి ఎప్పుడు కాలుమోపుతానన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని ఆమె తెలిపారు.

Jayaprada
Kamal Haasan
Rajanikant
Politicle Entry
Tamilnadu
  • Loading...

More Telugu News