Rajesh: శాడిస్టు భర్త రాజేశ్‌కు షరతులతో కూడిన బెయిల్.. పుంసత్వ పరీక్షల్లో పాస్!

  • గత నెలల్లో శైలజను పెళ్లాడిన రాజేశ్
  • తొలి రాత్రి భార్యకు నరకం చూపించిన వైనం
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక

తొలి రాత్రినే భార్యకు కాళరాత్రిగా మార్చిన చిత్తూరు జిల్లా మోతరంగనపల్లెకు చెందిన శాడిస్టు భర్త రాజేశ్‌, అతడి తల్లిదండ్రులకు షరతులతో కూడిన బెయిలు మంజూరైంది. వి.కోట మండలం ఆదెనపల్లె ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న రాజేశ్ చిన్న దామరగుంటకు చెందిన శైలజను గతేడాది డిసెంబరు 1న వివాహం చేసుకున్నాడు. అయితే తొలి రోజు రాత్రే భార్య శైలజకు నరకం చూపించాడు. ఆమెను తీవ్రంగా హింసించాడు.

అతడి బారి నుంచి తప్పించుకున్న శైలజను వెంటనే ఆసుపత్రిలో చేర్చగా ప్రాణపాయం తప్పింది. భార్యను వేధించిన రాజేశ్ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. శైలజ ఫిర్యాదుతో రాజేశ్, అతడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. పుంసత్వ పరీక్షల్లో రాజేశ్ ‘పాస్’ అయినట్టు అతడి తరపు న్యాయవాది  త్రిమూర్తి తెలిపారు.

Rajesh
Sailaja
Andhra Pradesh
Chittoor District
  • Loading...

More Telugu News