maheshbabu: కొరటాలతో మహేశ్ మొహమాటం లేకుండా చెప్పేశాడట!

  • షూటింగు దశలో 'భరత్ అనే నేను' 
  • వినోదంతోపాటు సందేశంతో కూడిన చిత్రం 
  • కొరటాలకి మహేశ్ సూచన    

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు 'భరత్ అనే నేను' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంకా రెండు పాటలు .. ఫైట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా మహేశ్ బాబు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తప్పకుండా ఉంటూ ఉంటాయి. అలాంటి ఐటమ్ సాంగ్ కోసమే ఆయన అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు కూడా.

కానీ 'భరత్ అనే నేను' సినిమాలో మాత్రం ఐటమ్ సాంగ్ గానీ .. ప్రత్యేక గీతాల్లాంటివి గాని ఉండటానికి వీల్లేదని కొరటాలతో మహేశ్ బాబు తేల్చి చెప్పారట. ఇది సందేశాత్మక చిత్రం కావడం వలన, ఇలాంటివి పక్కన పెట్టేయడమే మంచిదని సూచించారట. కథా నేపథ్యం కారణంగా కూడా ఇలాంటివి అడ్డుపడతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో కొరటాల కూడా మహేశ్ సూచనకి ఓకే చెప్పేశారట. అందువలన ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ వుండక పోవచ్చని అంటున్నారు.    

maheshbabu
kiara adwani
  • Loading...

More Telugu News